ఆసుపత్రి నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
ప్రతి విద్యార్థికి విద్యతో పాటు నైపుణ్యాలు అందేలా బోధించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న నూతన భవనాన్ని ఒప్పంద గడువు ప్రకారం మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి భవనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న నిర్మాణ, పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ప్రారంభం నాటికే అవసరమైన వైద్య పరికరాలు, విద్యుత్, నీరు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల పనులను సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, వారి విద్యా స్థాయిని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి విద్యార్థికి అవసరమైన విద్యాపరమైన పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత సమయంలోగా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీజీఎంఐడీసీ విశ్వప్రసాద్, సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు ,పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


