అంబులెన్స్‌లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
గంభీరావుపేట మండలంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా ప్రసవం చేశారు. శుక్రవారం గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాందేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రమవ్వడంతో పరిస్థితిని గమనించిన ఈఎంటి చెలిమెల సాయికృష్ణ, పైలట్ నాగరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్సు వాహనంలోనే ప్రసవం చేశారు. రాందేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు ఆపత్కాలంలో సమయానికి స్పందించి పురుడు పోసిన 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


