విజయవాడ బస్సులకు ఎల్‌బీ నగర్‌లో బోర్డింగ్ సౌకర్యం

విజయవాడ బస్సులకు ఎల్‌బీ నగర్‌లో బోర్డింగ్ సౌకర్యం

 పటాన్‌చెరు, టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేలా విజయవాడతో పాటు ఆ మార్గంలో ముందున్న ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఎక్కే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 1665 వద్ద ప్రయాణికులు బస్సులను ఎక్కవచ్చు. ఇప్పటివరకు విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎక్కేందుకు నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్లకు వెళ్లాల్సి రావడంతో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎల్‌బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బోర్డింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో మెట్రో ద్వారా అక్కడికి చేరుకుని నేరుగా బస్సు ఎక్కే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఇస్నాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వారికి ఈ సౌకర్యం ఉపయోగకరంగా మారనుంది. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌ను తప్పించుకుని మెట్రో మార్గంలో ఎల్‌బీ నగర్ చేరుకోవడంతో ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.ఈ సౌకర్యాన్ని విజయవాడ, పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
ఎల్బీనగర్,: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ చౌరస్తా గాంధీ సెంటర్ లో నాగోల్ రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డుపల్లి...
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు 
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభించిన ఎంఈఓ అజయ్ కుమార్