ఆలయ అభివృద్ధికి భక్తుల విరాలాల వెల్లువ
బాల్కొండ(నిజామాబాదు): "అలకొండ పురి రమ్య నగై: నవబి రావృతా ! తత్రేషా తు మహాదేవి నిమిషాంబా ప్రతి ష్ఠితా : !! (తొమ్మిది ఏతైనా నల్ల రాల్ల కొండల చేత చుట్టబడి ఉన్న అంద మైన అల్లకుండ, వల్లకొండ, @ బాల్కొండ)లో మహా శక్తి అయిన శ్రీ నిమిషంబ దేవత 524 సంవత్సరాల పూర్వం నుండే నిత్య నైవేద్య పూజలు అందుకుంటూ ఉందని ఆలయ అభివృద్ధి పనులకు భక్తుల ఆర్ధిక సహాయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆలయ సేవకులు బి. కృష్ణ రావు జోషి తెలిపారు.
ఉచిత కరెంటు బిల్లు
ఆలయానికి ప్రతి నెల కరెంటు బిల్లును నిజామాబాద్ లోని కోటగల్లీ లోని పోలకొండ లక్ష్మణ్ కుటుంబం వారిచే 2005 నుండి ఈ రోజు వరకు చెల్లిస్తున్నారని ఆలయ సెవ కులు బ్రాహ్మ రౌతు గంగాధర్ తెలిపారు. మార్చ్ 2025 నుండి జూన్ 2026 వరకు (16 నెలలకు సంబందించిన) ఆలయం కరెంట్ బిల్లు రూ, 1035/-అందజేశారని ఆలయ సేవకులు బి. ఆర్. నర్సింగ్ రావు వివరించారు.
స్లీపర్ నెల జీతం
2005 నుండి ఆలయం ప్రాంగణం శుభ్రం చేయడానికి స్వీపర్ నెల నెలా వేతనoలో కొంత మొత్తన్ని బాల్కొండ కు చెందిన నిజామాబాదు లో ఉంటున్న బి.చంద్రశేఖర్ (ఆర్. టి.సి)ఇస్తున్నారని ఆలయ సేవకులు నర్సింగ్ రావు వివరించారు.ఆలయంలో
ద్వాజ స్థంభం నిర్మాణం కోసం జగిత్యాల కు చెందిన బి.పవన్ కుటుంబం, బాల్కొండల కు చెందిన మహిళ మండలి తో పాటు "నఖాష్ సంఘ -1 ద్వారా చేయించడంతో పాటు ఆలయంలో సింహ వాహనాల్ని బి. గంగా ధర్ (చౌదరి) బి.ఆర్. నర్సింగ్ రావు కుటుంబాల ద్వారా చేయించడం జరిగింది. ఆలయం ముందు భాగంలో భోజనశాల షెడ్డు నిర్మాణం 2019 నుండి 2021 వరకు వివిధ గ్రామాల నుండి భక్తులు ఇచ్చిన కానుకలతో షెడ్డు నిర్మించడం జరిగింది.అలాగే శ్రీ నిమిషాంబ దేవి ఆలయంలో అన్న దానం కొనసాగించా లని బి.ఆర్ నర్సింగ్ రావు నెత్రుత్వంలో 3-4- 2015 మొట్ట మొదటి ఏప్రిల్ నెల మొదటి శుక్రవారం అన్నదానము ప్రారంభం కావడం ఈ కార్యక్రమం ప్రతి నెల మొదటి శుక్రవారం కొనసాగటం విశేషం.అలాగే ఆలయం వెనుక కళ్యాణ మండపం నిర్మాణానికి భక్తుల కానుకలచే పునాది తీయించడం జరిగిందని అయన వివరించారు.
ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు
తిరుమల తిరుపతి దేవ స్థానంలో పనిచేసిన ఆస్థాన విద్వాoసులు ఆకేళ్ల విభీషణ శాస్త్రి కుమారుడు ఆకెళ్ళ దశ కంట శాస్త్రి గారు ఆలయాన్ని 9-2-2005 సందర్శించి, శ్రీ నిమిషాంబ శతకాన్ని స్వయంగా వ్రాసి బుక్కులను ఇవ్వడం జరిగిందని, అలాగే ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి పర్యటన బాల్కొండ లోని శ్రీ నిమిషాంబ దేవి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతి డాక్టర్ రామనాథం గారు 24-07- 2023 రోజున సందర్శించి ఆలయ ప్రాముఖ్యతను తెలుసు కున్నారని నర్సింగ్ రావు వివరించారు.
ఆలయ ప్రాముఖ్యత శ్రీ నిమిషంబ దేవి అంటే
"నిముష " పేరు యొక్క అర్థం: నిమిష అంటే "క్షణ కాలము లేదా "కనురెప్ప పాటు సమయం ".అంబా అంటే "తల్లి" లేదా "దేవి".అంటే, "క్షణ కాలం లో ప్రత్యక్షమై వరములు ప్రసాదించే తల్లి" అని దీని అర్థం.శ్రీ మాతా నిమిషాంబ దేవి చరిత్ర – విస్తృత పాయింట్లు 1. నిమిషంలో భక్తుల కోరికలు తీర్చే అమ్మవారు శ్రీ మాతా నిమిషాంబ దేవి. 2. ఆమెను పర్వత దేవి, ఆదిపరాశక్తి అవతారంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎక్కువ వచ్చే భక్తులు కుటుంబంలో కల హాలు,దుష్ట శక్తుల పీడ గ్రహితులు,సంతానలేమి , వివాహం కాలేని వారు , ఉద్యో గాలు చేస్తూన్న వారిలో ఆటంకాలు, ప్రమోషన్ రాక పోవడం లాంటి సమస్యలతో పాటు దుష్ట గ్రహ పీడుతులతో బాధపడుతూ ఉన్న భక్తు లందరూ ఈ ఆలయానికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులను " కొబ్బరి కాయను ఎర్రటి వస్త్రం లో తో మొక్కు రూపంలో ఆలయంలో కట్టుకుంటే సమస్యలు మూడు వారాల్లో తీరుతాయని,భక్తుల మొక్కులు తీరిన అనంతరం ఏదైనా నెలలో మొదటి శుక్రవారం ఆలయంలో అన్నదానం చేసిన తర్వాత తర్వాత 108 మార్లు ఆమ్మ వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని అయన వివరించారు.
శుభ కార్యాయాలకు నిలయం
బాల్కొండ లో కొలువై ఉన్న అమ్మ వారి ఆలయానికి నిజామాబాదు జిల్లా భీంగల్ కు చెందిన బ్రహ్మ రౌతు సుజాత, రాధా కిషన్ కుమారుడు వివాహం కావడం లేదని (3) వారాల పాటు వచ్చి అమ్మ వారిని వేడుకొనగా వారి కుమారుదైన బి.తరుణ్ కుమార్ వర్మ, ఆర్మూర్ కు చెందిన నాంపల్లి మౌనిక, విజయ్ కుమార్ దత్త పుత్రిక తో వివాహo కుదిరిన అనంతరం శ్రీ నిమిషంబ ఆలయంలో మొట్ట మొదటి సారి వివాహం జరిగిందని అయన వివరించారు.
ఆలయంలో పనులకు సహాయం చేయండి
ఈ ఆలయంలో కల్యాణ మండపం నిర్మాణానికి ఆర్ధిక సహాయం కోసం కానుకలను "శ్రీ నిమిష్బా దేవి టెంపుల్ డెవలప్‌మెంట్ సొసైటీ" ఖాతా నంబర్‌కు కానుకలు పంపాలి. 073710011109628 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా "బాల్కొండ" నిజామాబాద్ బ్రాంచ్ I. F. S.C UBIN 0807371.లేదా క్యూ.. ఆర్. కోడ్ ద్వారా పంపి "స్క్రీన్ షాట్" ను 9666759297 నంబర్‌కు పంపాలని ఆలయ సేవకులు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

