ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిరంజీల వితరణ

-15 బాక్సులు సిరంజీలను వితరణ చేసిన మండల కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిరంజీల వితరణ

కారేపల్లి(ఖమ్మం) మండల కేంద్రమైన కారేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యుడు సురేష్ పిలుపుమేరకు మండల మెడికల్ షాఫ్ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరంజీ బాక్సులను వితరణ చేశారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి రంగనాథ్,ఉపాధ్యక్షులు అనంతారపు వెంకటాచారి,గౌరవ సలహాదారులు సూర్యదేవర వెంకటేశ్వరరావు,సభ్యులు డాక్టర్ పోలగాని శ్రీనివాసరావు,వెంకట్ తోపాటు మండలంలోని మెడికల్ షాపుల యజమానుల సమక్షంలో మండల వైద్యాధికారి గుగులోత్ సురేష్ కు 15 బాక్సుల సిరంజీలను అందజేశారు.ఆరోగ్య కేంద్రంలో నిత్యం రోగులకు వాడేందుకు సిరంజీలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వైద్యాధికారి సూచన మేరకు ఈ సిరంజీల బాక్సులను అందజేయడం జరిగింది. అడగ్గానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సిరంజిల బాక్స్ లను అందజేసిన కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులకు వైద్యాధికారి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Views: 58

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు