కృష్ణ నగర్ సంజీవిని హనుమాన్ మందిరంలో యజ్ఞోపవితo.
సదాశివపేట: రక్షాబంధన్ సందర్భంగా సదాశివపేట శ్రీకృష్ణ నగర్ కాలనీలోని సంజీవిని హనుమాన్ మందిర్లో కృష్ణ నగర్ కాలనీ పద్మశాలి కుల బాంధవుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ పూజారి చంద్రశేఖర్ పాల్గొని యజ్ఞోపవితం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కనకరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే కృష్ణానగర్ పద్మశాలి కుల బాంధవులుయజ్ఞోపవిత కార్యక్రమంలోపాల్గొని పూజలు నిర్వహించి, అనంతరం జంజిరాలుమార్చుకొని విజయవంతం చేయాలన్నారు .ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వొగ్గు గణేష్ , కోశాధికారి రుద్ర నరసింహులు, పద్మశాలి రవి , ఎర్వ సాయిలు, రుద్ర లక్ష్మణ్ , సాలె రాజు, పోలప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


