వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి నీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. రిమ్స్ ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కిజార్ పాషా, జిల్లా పబ్లిసిటీ కోఆర్డినేటర్ మేకల జితేందర్, డీసీసీ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, డీసీసీ కార్యదర్శి హిమ అభిషేక్,తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం, చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


