వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్పూర్తితో ఉద్యమిద్దాం.:బొట్ల చక్రపాణి పిలుపు

వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్పూర్తితో ఉద్యమిద్దాం.:బొట్ల చక్రపాణి పిలుపు

హన్మకొండ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని హనుమకొండ నార్త్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిబసు నగర్ ఫేస్ టు లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చక్రపాణి చాకలి ఐలమ్మ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... నిజాం నిరంకుశ పాలనలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని అందులో భాగంగానే చిట్యాల ఐలమ్మ తను భూమిని కౌలు తీసుకొని సాగు చేసుకుని పంట చేతికచే సమయంలో విసునూరు రామచంద్రారెడ్డి ఆ పంటను కాజేయాలని, చాకలిది వ్యవసాయం చేయడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేసి ఐలమ్మను ఇబ్బందుల గురి చేస్తే ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అండతో జాకీర్దారులను, జమీందారులను, విసునూరు రామచంద్ర రెడ్డిని ఎదిరించిన పోరాడిన యోధురాలు వీరనారి ఐలమ్మ అని ఆయన కొనియాడారు. అలాంటి వీరనారి ఐలమ్మను మనస్ఫూర్తిగా తీసుకొని పేదలు కష్టజీవుల రాజ్యాం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రైతంగా సాయుధ మహత్తర పోరాటాన్ని హిందూ ముస్లింల గొడవగా బిజెపి కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ పోరాటంలో ముస్లిం రాజు నిజాం అయినా కింద ఉన్న భూస్వాములు జాగిర్దారులు హిందువులేనన్నారు. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో సోయా బులాఖాన్, షేక్ బందగి ఇలాంటి అనేకమంది ఉన్నారని అని గుర్తు చేశారు. నేటి నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏరియా కార్యదర్శి గాదె రమేష్ ఏరియా కమిటీ సభ్యులు మంద మల్లేశం అడపా తార, మానస, గట్టయ్య, సంపూర్ణ, కృష్ణవేణి, కళా రమ తదితరులు పాల్గొన్నారు.

Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు