ములుగులో రైస్ మిల్లర్ల ధర్నా , 13 ప్రధాన డిమాండ్లు

ములుగు : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని  డీ ఎల్ ఆర్ నుండి ర్యాలీ గా బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ,  అనంతరం  గాంధీ విగ్రహానికి మాల వేసి  పోస్ట్ ఆఫీసు వద్ద గల ధర్నా చౌక్ కు చేరుకొని ధర్నా చేశారు.  రైస్ మిల్లర్ల భద్రత - రైతుల భవిష్యత్తు నినాదంతో ఈ ధర్నా జరిగింది. చిన్న మిల్లు, పెద్ద మిల్లు, మధ్య మిల్లు అనే తేడా లేకుండా అందరూ కలిసి సభ్యులైతేనే మన కష్టం, నష్టం, మన సమస్యలు, మన భవిష్యత్తు ఇండస్ట్రీని కాపాడుకునే విధానంలో ఉంటుందని మిల్లర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ప్రధాన డిమాండ్లు:- మిల్లింగ్ చార్జీని రూ.150 కు పెంచాలి.
- బ్యాగ్ ధర రూ.11 గా నిర్ణయించాలి.
- రాబాక్సిన సివిల్ సప్లైస్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్, కస్టడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలి.
- రుణాలపై వడ్డీ మరియు 12 శాతం వడ్డీని మాఫీ చేయాలి.
- 2022-23 రబీ టెండర్ ధాన్యం ధరను సవరించాలి.
- రైస్ మిల్లులను పరిశ్రమగా గుర్తించి 200 హెచ్ పి  వరకు ఎల్ టి  విద్యుత్ సరఫరా చేయాలి.
- ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిగా రా రైస్ గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ గా స్వీకరించాలి.
- ఎఫ్ సి ఐ నిబంధనలు సడలించాలి. ఈ ధర్నాకు జిల్లాలోని మిల్లర్ల సంఘం అధ్యక్షులు బాదం  ప్రవీణ్ తో  కార్యదర్శులు, కోశాధికారులు , జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు