రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ధర్నా
ములుగు, రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నాయకత్వంలో బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.డీఎల్ఆర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన మిల్లర్లు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పోస్టాఫీసు వద్ద గల ధర్నా చౌక్ లో ధర్నాకు దిగారు.రైస్ మిల్లర్ల భద్రత - రైతుల భవిష్యత్తు. ....నినాదంతో జరిగిన ఈ ధర్నాలో బాదం ప్రవీణ్ మాట్లాడుతూ చిన్న, పెద్ద, మధ్య మిల్లు అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా ఉంటేనే పరిశ్రమను కాపాడుకోగలమన్నారు. మిల్లింగ్ చార్జీని రూ.150 కు, గన్నీ బ్యాగ్ ధరను రూ.11 కు పెంచాలని, పెండింగ్ సివిల్ సప్లైస్, ట్రాన్స్ పోర్ట్, కస్టోడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలని, బ్యాంకు రుణాలపై 12 శాతం అపరాధ వడ్డీని మాఫీ చేయాలని, రైస్ మిల్లులను పరిశ్రమగా గుర్తించి 200 హెచ్ పి వరకు ఎల్ టి విద్యుత్ ఇవ్వాలని, ఖరీఫ్ ను రా రైస్ గా, రబీని బాయిల్డ్ రైస్ గా తీసుకోవాలని, ఎఫ్ సి ఐ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ తో పాటు సంఘం కార్యదర్శులు, కోశాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


