ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి
మిడ్జిల్,:మిడ్జిల్ మండల పరిధిలోని కొత్తూరు రైతు వేదికలో శుక్రవారం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు అంశంపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోని రైతులకు ఎరువుల బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోని రైతులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు తమ గ్రామంలోని ఏఈఓలను సంప్రదించడం లేదా సమీపంలోని CSC పాయింట్‌ను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని ఏఈఓలు శివప్రసాద్, గౌస్ పాషా, గ్రామ సర్పంచ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులందరూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వారు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


