మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం
వెంకటాపురం : వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ములుగు జిల్లా,వెంకటాపురం మండల స్థాయి అధికారులతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి .ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈసమావేశంలో నిమజ్జన ప్రదేశాల గుర్తింపు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, బారికేడింగ్, వైద్య మరియు అత్యవసర సేవలు, అలాగే నిమజ్జనం అనంతరం వ్యర్థాల తొలగింపు తదితర అంశాలపై సమీక్షించి, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ , మండల పంచాయతీ అధికారి. బొగ్గ నారాయణ. ఏఎస్సై బి పురుషోత్తం , లైన్ ఇన్స్పెక్టర్ ఫరీద్ ,మండల స్థాయి అధికారులు ,గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


