రేషన్ కార్డుల పంపిణీపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యంతరం

రేషన్ కార్డుల పంపిణీపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యంతరం

హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి,17వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కౌన్సిలర్ రవీందర్ మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వార్డులో స్థానిక కౌన్సిలర్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ వచ్చి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం సమంజసం కాదని రవీందర్ అన్నారు. ప్రోటోకాల్ పాటిస్తూ ప్రజా కార్యక్రమాలను అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్వహించాలని కోరారు. ప్రశ్నించినప్పుడు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని పేర్కొన్నారు.స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి చిత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారని, రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రం పాత్రను కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వార్డుల్లో అధికార పార్టీ నాయకులను మాత్రమే పిలిచి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో పాలకవర్గం,అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని రవీందర్ అన్నారు.గత ఆరు నెలలుగా కమిషనర్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారని, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ హుస్నాబాద్‌లోనూ పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అన్ని వార్డుల్లో ప్రోటో కాల్ పాటించేలా కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజా సమస్యలను పట్టించుకుని అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని రవీందర్ కోరారు.ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్ బొల్లి శ్రీనివాస్, నాయకులు సాయన్న, వాల నవీన్, బత్తుల చంద్రమౌళి, గడిపే కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు