చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా స్వరోదయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పోరాటం
టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు
నిజామాబాద్ :దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా సర్వోదయ తెలంగాణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని పార్టీ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, నవీన్ ఆచారి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...దొరల పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆమె స్ఫూర్తితోనే సర్వోదయ తెలంగాణ కోసం తమ పార్టీ చీఫ్ కవిత ముందడుగు వేస్తున్నారన్నారు. అప్పట్లో దొరలు, దేశ్ ముఖ్ ల దుర్మార్గ పాలన సాగితే...ఇప్పుడు నయా హిట్లర్ల రూపంలో అదే విధమైన పాలన సాగుతుందని చెప్పారు. ఈ అక్రమ పాలకుల ఆటకట్టించేందుకే కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పుట్టుకొచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎత్తరి మారన్న, ఆనందం, బొడ్డుపల్లి లింగం తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


