పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా

పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు  : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా

ఆదిలాబాద్‌ జిల్లాలో కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 60 రోజుల ప్రత్యేక ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక శిక్షణలో మొత్తం 200 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 100 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు, 100 మంది ఎస్‌ఐ అభ్యర్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. అభ్యర్థుల ఎంపికను నిర్దేశిత రిజర్వేషన్‌ ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు.

- బీసీలు – 25 శాతం
- ఎస్సీలు – 25 శాతం
- ఎస్టీలు – 25 శాతం
- ఈబీసీ/ఈడబ్ల్యూఎస్‌/అనాథలు – 25 శాతం

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయానికి సంబంధించిన ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రం, రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పోలీస్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు తెలిపే పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

  • దరఖాస్తుల చివరి తేదీ: సెప్టెంబర్‌ 13, 2026
    - మెరిట్‌ జాబితా: సెప్టెంబర్‌ 16, 2026
    - సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబర్‌ 17 నుంచి 18 వరకు
    - శిక్షణ ప్రారంభం: సెప్టెంబర్‌ 19, 2026
  • 60 రోజుల శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉచితంగా పుస్తకాలు అందించడంతో పాటు, ప్రతిరోజూ నిపుణులైన అధ్యాపకులతో నాలుగు తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అభ్యర్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రతి వారం పూర్తి స్థాయి పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. మరిన్ని వివరాలకు:  ఫోన్‌: 08732-221280, 9949684959, 9494149416 బీసీ స్టడీ సర్కిల్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌, ఆదిలాబాద్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో SIR–2026 పురోగతిని పరిశీలించిన CEO సుధర్శన్ రెడ్డి 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి  సి. సుధర్శన్ రెడ్డి, IAS, శుక్రవారం సెరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 ప్రక్రియ...
నీట్ విజేత ‘ఇందు’కు కొండంత అండ గా సూర్యాపేట ఎస్పి 
మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం
అజయ్‌కుమార్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేసిన ఉపకులపతి...
కేఎల్ఐ నీటిని వెంటనే విడుదల చేయాలి
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి మేలు: కలెక్టర్ రాజర్షిషా