బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
మాజీ ఆర్మీ అధికారి ప్రధాన నిందితుడు.. మరో ముగ్గురు అధికారుల అరెస్ట్
హైదరాబాద్: బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన ఓ మాజీ ఆర్మీ అధికారిని పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన అతడు ఆర్థిక అవసరాల కోసం ఆయుధాల చోరీకి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.దాదాపు మూడు నెలలుగా పక్కా ప్లాన్‌తో ఆయుధా లను దశలవారీగా బయటకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ఆయుధాలకు ప్రత్యేక కోడింగ్ నంబర్లు లేకపోవడాన్ని నిందితులు తమకు అనుకూ లంగా మలుచుకున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది కళ్లుగప్పి తుపాకులు, మ్యాగజైన్లు, బుల్లెట్లను బయటకు తరలించినట్లు వెల్లడించారు.చోరీకి సహకరించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురు ఆర్మీ అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయడం, డ్యూటీలో ఉన్న అగ్నివీరులను ఇతర పనులకు పంపించడం వంటి చర్యల ద్వారా చోరీకి మార్గం సుగమం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.కాగా, చివరిగా ఆగస్టు 30న భారీ వర్షాన్ని ఆసరాగా చేసుకుని ఆయుధాల గది తాళాలు పగులగొట్టి, బయట వ్యక్తులు చోరీ చేసినట్లుగా నాటకం ఆడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపి నిందితులను గుర్తించారు.ఈ కేసులో పోలీసులు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 4 AK-203 రైఫిల్స్, 1 INSAS రైఫిల్, 7 పిస్టల్స్, 21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్, 1,900కు పైగా లైవ్ బుల్లెట్లు ఉన్నాయి. కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

