ఆచార్య దేవోభవ ....
బోధన్, (నిజామాబాద్) : ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ఆచార్య దేవోభవ 2026 కార్యక్రమాన్ని స్థానిక ఇందూరు హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్, విశిష్ట అతిధులుగా బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, సాలుర మండల విద్యాశాఖ అధికారిణి రాజీ మంజూష లు విచ్చేశారు. ఈ సందర్బంగా ట్రస్మా ఆధ్వర్యంలో బోధన్ డివిజన్లో ఉన్న ప్రతి పాఠశాలలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారిని డిఈఓ,ఎంఈఓల చేతుల మీదుగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిశోర్, గౌరవ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాస్ రావు, బోధన్ అధ్యక్షులు ముస్త్యాల హరికృష్ణ, కార్యదర్శి మంతె సురేష్, కోశాధికారి కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు మిద్దెల రాజు, డివిజన్ సెక్రెటరీ అనిల్ కుమార్, డివిజన్ కోశాధికారి సురేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వివిధ పాఠశాలల, కళాశాలల కరెస్పాండంట్ లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


