రూ.19 లక్షలతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
పటాన్‌చెరు,: 11శ్రీనగర్ కాలనీలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.19 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ఈ పనులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాలనీలో వర్షపు నీటి పారుదల సమస్యకు పరిష్కారం చూపే లక్ష్యంతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైన్ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర బిక్షపతి, శ్రీధర్ చారి, టప్ప కుమార్, రాజిరెడ్డి, శాంతినగర్–శ్రీనగర్ అధ్యక్షులు అంజిరెడ్డి, ఏ. వెంకట్ రెడ్డి, టైలర్ విజయ్, రవీంద్ర చారి, కార్ రాజు, డీఈ కృష్ణవేణి, ఈఈ సురేష్ కుమార్, ఏఈ లావణ్య, కాంట్రాక్టర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


