5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి

  • నిజామాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల భారీ సమ్మె
  • సుమారు 1000 మంది పాల్గొనడం

నిజామాబాద్, : 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రధాన డిమాండ్‌తో పాటు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు గత 11 సంవత్సరాలనుండి ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపుకు నిజామాబాద్ జిల్లాలో భారీ స్పందన లభించింది. సెప్టెంబర్ 11న నిర్వహించిన ఒకరోజు సమ్మెలో నిజామాబాద్ జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 1000 మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు.
5 రోజుల పని – ఇక ఆలస్యం వద్దు
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు,RBI,NABARD, SEBI, LIC వంటి సంస్థలకు ఇప్పటికే 5 రోజుల పని విధానం అమలులో ఉందని,బ్యాంకులకి కూడా ఇప్పటికే సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బ్యాంకు ఉద్యోగులు పని వేళలు ముగిసిన తర్వాత కూడా పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. సెలవు రోజుల్లో సైతం విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాంకేతికత పెరిగినా పని భారం మాత్రం తగ్గలేదు. ఉద్యోగుల పని–జీవిత సమతుల్యత కోసం 5 రోజుల పని దినాలను  వెంటనే అమలు చేయాలి” అని నాయకులు అన్నారు
బ్యాంకుల లాభాల్లో ఉద్యోగుల కృషి కీలకమని పేర్కొంటూ న్యాయమైన PLIని అందరికీ సమానంగా, పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని కోరారు. NPS స్థానంలో OPS పునరుద్ధరణ, పెన్షన్ సమస్యల పరిష్కారం, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య బీమా భారాన్ని తగ్గించడం తదితర సమస్యలను కూడా పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజలకు అసౌకర్యం కలిగించడం మా ఉద్దేశం కాదు
సమ్మె కారణంగా ఖాతాదారులకు కొంత అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని, అయితే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, IBA దృష్టికి తీసుకెళ్లేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు పిలుపునిచ్చామని నాయకులు తెలిపారు.5 రోజుల పని దినాలు,తగినంత సిబ్బంది, గ్రాట్యుటీ పెంపు,NPSలో అదనంగా జమ చేసే 4% చందాపై ఆదాయపు పన్ను మినహాయింపు, పెన్షన్ అప్డేషన్ వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, IBA సానుకూలంగా పరిగణించి వెంటనే పరిష్కరించాలి, లేనియెడల ఇదివరకే ప్రకటించిన విధంగా నెల చివరన జరిగే 3రోజుల సమ్మెకు మరియు అక్టోబర్ లో నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబొమని హెచ్చరించారు. సమ్మెను విజయవంతం చేసిన బ్యాంకు ఉద్యోగులకు , అధికారులకు , మరియు ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన ఇతర ట్రేడ్ యూనియన్లకు UFBU నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. దీనిలో UFBU నిజామాబాదు యూనిట్ కన్వీనర్ M.V.రమేష్,గురునాథ్,రాజు, మనోజ్ సింగ్ , వంశీ, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు