జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- రాజీ మార్గమే.. రాజ మార్గం
- జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్
భూపాలపల్లి టౌన్ :ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన వివాదాలు, వైవాహిక సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. “రాజీ మార్గమే.. రాజ మార్గం” అని పేర్కొంటూ చిన్నచిన్న కేసుల విషయంలో కక్షలు పెంచుకుని సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని ఎస్పీ గారు సూచించారు. న్యాయశాఖ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల కక్షిదారులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులకు, కోర్టు విధులు నిర్వహించే సిబ్బందికి ఎస్పీ గారు సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని ఎస్పీ తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


