గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

  • ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి
  • పోలీస్ స్టేషన్‌లో ఇంటిమేషన్ లెటర్ ఇవ్వాలి
  • శాంతిభద్రతలకు సహకరించాలన్న పెన్ పహాడ్ ఎస్ఐ బాలు నాయక్

పెన్ పహాడ్, (సూర్యాపేట ): మండల పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పెన్ పహాడ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ఎన్. బాలు నాయక్ స్పష్టం చేశారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను మండలంలో ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వారు అందించిన అధికారిక లింక్ ద్వారా తమ మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దానికి సంబంధించిన ఇంటిమేషన్ లెటర్‌ను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందజేసి అనుమతి పొందాలన్నారు.ఉత్సవాల నిర్వహణలో భాగంగా మైక్ సెట్ల అనుమతి, విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని, రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వాహకులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తీసుకునే భద్రతా చర్యలకు ఉత్సవ కమిటీ సభ్యులు, యువత పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్ఐ బాలు నాయక్ పిలుపునిచ్చారు.

Views: 135

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు