చిన్న మల్లారెడ్డి లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి బ్యూరో : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ గురువారం ఏఈఓ కె శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చిన్న మల్లారెడ్డి. గ్రామంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తో ఫర్టిలైజర్ రైతులకు సంబంధించిన పనులను చేసుకోవచ్చని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తో కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


