చిలువేరు రైతులకు ముఖ్య గమనిక.. వెంటనే ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
మిడ్జిల్, : చిలువేరు: చిలువేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వెలుగొమ్ముల క్లస్టర్‌కు చెందిన అస్రా ఫాతిమా సూచించారు. చిలువేరు గ్రామంలో మొత్తం 1,768 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 1,481 మంది రైతుల ఫార్మర్ రిజిష్ట్రేషన్ పూర్తయిందని, ఇంకా 287 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. మిగిలిన రైతులు వెంటనే ఫార్మరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు. నమోదు లేకపోతే యూరియా సరఫరాతో పాటు ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున చిలువేరు గ్రామంలోని ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి కాని రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అస్రా ఫాతిమా విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


