రహదారి నిబంధనలు

భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు

రహదారి నిబంధనలు

మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనుమల్ల వైకుంఠం ఆధ్వర్యంలో రహదారి నిబంధనలు, భద్రతపై విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన సదస్సు ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లైసెన్స్ లేని వారు వాహనాలు నడపరాదని, ఏదైనా యాక్సిడెంట్ చేసిన వారు పోలీస్ కేసులో ఏవన్ ముద్దాయిగా ఇరుక్కుంటారని, పోలీస్ కేసులలో ఉన్న వారికి ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు రావని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, స్నేక్ డ్రైవింగ్, రాంగ్ రూటు, సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలు నడపరాదని, ఇన్సూరెన్స్ లేని ఎలాంటి వాహనాలు నడపరాదని , హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయకూడదని, జీబ్రా లైన్స్ దగ్గరే రోడ్స్ క్రాస్ చేయాలని తెలిపడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడు హనుమాన్ సాగర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, ప్రమాణాలను పాటించడానికి ట్రాఫిక్ విద్య చాలా ముఖ్యమని ఇందులో ప్రతి ఒక్కరు వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, వేగ పరిమితిని పాటించడం, సిగ్నల్స్ పాటించడం, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించడం జరిగింది. అనంతరం విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్, గోపికృష్ణ, ఇమామ్, రవీందర్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. 

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News