శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు

శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు

గజ్వేల్/సిద్దిపేట  :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు దేశపతి రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అర్చనలు, అభిషేకాలు, దివ్యాలంకరణలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పవిత్ర దినం కావడంతో గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చి ప్రత్యేక వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సారిక శ్రీనివాస్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా సారిక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణ వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. ఆ శ్రీ వరలక్ష్మీ దేవి దివ్య అనుగ్రహం, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇల్లూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు సంతోషాలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత సేవా పరిషత్ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన