గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
తలకొక్కుల సేవలు అభినందనీయం : ఎన్.సి. రాజమౌళి
గజ్వేల్/సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తలకొక్కుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం రోజున ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి రాజమౌళి, లయన్స్ క్లబ్ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు మరియు స్థానిక పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై తలకొక్కుల లక్ష్మణ్‌కు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ తలకొక్కుల లక్ష్మణ్ తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ, సమాజంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సమాజంలో ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం తలకొక్కుల లక్ష్మణ్ కుమారులు దుర్గాప్రసాద్, మధుసూదన్ మాట్లాడుతూ తమ తండ్రిగారి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు డాక్టర్ కుమారస్వామి, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు దేవదాస్, యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్, లయన్ పరమేశ్వర చారి, ఎర్రం శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, మల్లేశం గౌడ్, రాజారాం, ఎల్లంరాజు, వాసు, వెంకటేష్, శ్రీనివాస్, తలకొక్కుల లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
