మంగనూరు గ్రామంలో రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ

మంగనూరు గ్రామంలో రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ

నాగర్‌కర్నూలు:నాగర్ కర్నూల్ నియోజకవర్గం,బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో రైతులకు ఉచితంగా స్ప్రింక్లర్ పైపులు, నల్లాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గ్రామ సర్పంచ్ జాలం నాగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్ప్రింక్లర్ పైపులను లబ్ధి పొందిన రైతులు *బూదూరు మల్లికార్జున్ రెడ్డి, శేఖర్, కాశిరెడ్డి, చంద్రారెడ్డి, సంగనమోని రామాంజనేయులు, మావిళ్ళ కురుమూర్తి, అప్పల కుర్మయ్య, జాలం ఎల్లస్వామి, నాగరాజు, కదిరి నరసింహారెడ్డి, సల్ల భీమయ్య, సల్ల మోగులాలు, శరత్ చంద్ర* తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు స్ప్రింక్లర్ సెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాలం నాగయ్య మాట్లాడుతూ "రైతులు ప్రతి నీటి బొట్టును వృథా చేయకుండా కాపాడుకోవాలి. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్న నేపథ్యంలో స్ప్రింక్లర్ పైపుల వాడకం ఎంతో అవసరం. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించవచ్చు. రైతులందరూ నూతన వ్యవసాయ విధానాలు, ఆధునిక సాగు పద్ధతులు అలవర్చుకొని అధిక దిగుబడులు సాధించాలి"* అని కోరారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వ్యవసా యానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. స్ప్రింక్లర్ల వల్ల కూలీల ఖర్చు తగ్గడంతో పాటు, ఎరువుల వినియోగం కూడా సమర్థవంతంగా ఉంటుందని రైతులకు వివరించారు.కార్యక్రమం అనంతరం రైతులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, సర్పంచ్ నాగయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. 
Views: 1623

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,