కాకతీయ కీర్తి పురస్కారానికి గోకారపు శ్యాం కుమార్

కాకతీయ కీర్తి పురస్కారానికి గోకారపు శ్యాం కుమార్

హనుమకొండ న్యూస్ :,సమాజహితమే లక్ష్యంగా తన కెమెరాతో ఎన్నో విలువైన దృశ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఫొటో జర్నలిజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హనుమకొండకు చెందిన సీనియర్ ఫొటో జర్నలిస్ట్ గోకారపు శ్యాం కుమార్ ను ప్రతిష్టాత్మక కాకతీయ కీర్తి పురస్కారం వరించింది.శ్యాం కేవలం ఫొటోలు తీసే జర్నలిస్ట్ మాత్రమే కాదు,సమాజంలోని సమస్యలను, ప్రజల బాధలను, విజయాలను తన కెమెరా కళ్లతో సమాజం ముందుకు తీసుకువచ్చిన నిబద్ధత కలిగిన ఫొటో జర్నలిస్ట్ గా గుర్తింపు ఉంది. ఆయన తీసిన అనేక ఛాయాచిత్రాలు సామాజిక చైతన్యానికి అద్దం పట్టాయి,తన వృత్తిని సేవగా భావిస్తూ నేటి వరకు అంకితభావంతో పనిచేస్తున్న ఆయన ప్రతిభకు ఈ పురస్కారం మరో మైలురాయి అవుతుంది. ఫొటో జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరిచిన శ్యాంకు ఇప్పటికే రెండు జాతీయ స్థాయి, 17 రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి, అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా రూ.25,116 నగదు పురస్కారంతో సత్కరించారు. అనేక అవార్డులు అందుకున్నప్పటికీ మరింత వినయంతో, అదే అంకితభావంతో తన కెమెరాను సమాజ సేవకు అంకితం చేస్తున్న శ్యాం కు  శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన కాకతీయ కీర్తి పురస్కారం దక్కడం హనుమకొండ ఫొటో జర్నలిజం రంగానికి గర్వకారణం. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా కుటుంబ సమేతంగా శ్యాంకు కాకతీయ కీర్తి పురస్కారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కళా కృష్ణ, ఈగ మల్లేశం, కళాబంధు బిరుదు అవార్డు గ్రహీత గట్టు మహేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్ పి వి మదన్మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News