సమిష్టి సహకారంతో ప్రాథమిక సహకార సంఘ అభివృద్ధి 

సమిష్టి సహకారంతో ప్రాథమిక సహకార సంఘ అభివృద్ధి 

గంభీరావుపేట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వేశాల వెంకటి 

గంభీరావుపేట  : రైతుల, సభ్యుల సమిష్టి సహకారంతోనే సంఘం అభివృద్ధి సాధ్యపడుతుందని గంభీరావుపేట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వేషాల వెంకటి అన్నారు. గంభీరావుపేట సింగల్ విండో మహాజన సభ సోమవారం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ,తన నియామాకానికీ సహకరించిన కాంగ్రెస్ పెద్దలు కటకం మృత్యుంజయం, కేకే మహేందర్ రెడ్డి లతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.ఆయిల్ పామ్ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలి. అందుకు సంఘం ద్వారా పూర్తి సహకారం అందిస్తాము,ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజషన్ కోసం సంఘం పరిధిలో 750 మంది సభ్యులు రూ రెండు వేలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు 450 మంది చెల్లించారు.గతంలో మాదిరిగా మెరుగైన సేవలు అందిస్తాం అందిస్తామని ,వరి దాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబెట్టుకోవాలి, జియో ట్యాగింగ్ అందుబాటు లోకి తెస్తున్నారు. కాబట్టి కేంద్రాలలోనే  తూకాలు జరుగతాయి అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, డైరెక్టర్లు అజ్మీర భాస్కర్, గుడికాడ బాలయ్య, ముత్యాల మల్లారెడ్డి, మోతే రమేష్, కుంట సత్తయ్య, బొల్గం బాలరాజ్ గౌడ్, అఖిల, ముచ్చ ఆనందం, చేరుకూరి మహేష్, దోశల యాదమ్మ, గూని బుచ్చయ్య, తోపాటుప్రత్యేక అధికారి రాములు, సీఈవో చందుపట్ల రాజిరెడ్డి, సిబ్బంది  పాల్గొన్నారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News