ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ స్పష్టం చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతిని శనివారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుడా పార్కు (వేములవాడ కామన్) వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించి వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి అని అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ దైర్యశాలి అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘాల చైర్మన్ బస్వరాజ్ శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీటీ రాజు, చిన్న కోడూరు మండల అధ్యక్షుడు జంగపల్లి రాజమల్లు, జిల్లా సంయుక్త కార్యదర్శి జలిగామ గంగాధర్, మరియు సిద్దిపేట పట్టణ రజకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


