విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి.:  ఎమ్మెల్యే

విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి.:  ఎమ్మెల్యే

జిన్నారం ఘనంగా ప్రారంభమైన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి పోటీలు.

జిన్నారం, సంగారెడ్డి :  విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలను సోమవారం ఉదయం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించి.. క్రీడాజ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు, క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా క్రమశిక్షణతో పాటు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.  ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచేలా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని 7 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఐదు ఎకరాల విస్తీర్ణంతో వివిధ మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.  వివిధ క్రీడ అంశాల్లో ప్రతిభ చూపుతున్న క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశనుండే క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రుల సైతం సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 38

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News