చిరు వ్యాపారులపై జులుం.

చిరు వ్యాపారులపై జులుం.

  • ఆయన ఆనందం కోసం... ఆ సందులో ఆకలి మంటలు.
  • ఈ సందులో వ్యాపారాలన్నీ బంద్ చేయాలని ఓ ఆర్యవైశ్యుడి హుక్కుం.
  • సొంత కార్యానికి చిరు వ్యాపారుల పొట్టకొట్టడంపై ఆవేదన.
  • పెద్దపెద్ద కార్ల రాకపోకల కోసం వ్యాపారాలకు తాళాలు.
  • కిరాయిలు కట్టలేక సతమతం.. ఒక్కరోజు బంద్‌తో మరింత భారం
  • దుకాణాల బంద్‌పై అధికారిక ఆదేశాలు ఉన్నాయా.
  • వ్యాపారుల ఉపాధికి భరోసా కల్పించాలని స్థానికుల విజ్ఞప్తి.

సూర్యాపేట: జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ సామాజికవర్గానికి చెందిన ఆయన ఇంట్లో కార్యమంట..మా కార్యక్రమానికి ప్రముఖులు పెద్దపెద్ద కార్లలో వస్తారు. వారికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది.ఈ సందులోని వ్యాపారాలన్నీ బంద్ చేయాలని హుకుం చేశాడు. దీంతో ఆ సందులో దుకాణదారులంతా బంద్ చేశారు.కాని ఆయన ఇంటి ఎదురుగా బ్యాంకు ఉండగా ఆ బ్యాంకు మాత్రం బంధు చేపించకుండా సొంత కార్యం కోసం చిరు వ్యాపార దుకాణాలు బందు చేసి పొట్టగొట్టాడంటూ పలువురు దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ వెనుక రమేష్ సైకిల్ స్టోర్ ఎదురు సందులో గల ఓ నాయకుడి ఇంట్లో కార్యం కోసం ఆ సందులో ఇడ్లీ బండ్లను బందు చేయించడం జరిగింది... తమ ఇంటికి రాజకీయ నాయకులు, ప్రముఖులు పెద్ద ఎత్తున వస్తారని ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని మీ దుకాణాలను బంద్ చేయాలని హుకుం జారి చేయడంతో ప్రస్తుత పరిస్థితుల్లో దుకాణదారులకు కిరాయిలు కూడా రాని పరిస్థితిలో బంద్ చేయించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Views: 307

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News