రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యునిగా ఇ.వి. శ్రీనివాస్ రావు ఏకగ్రీవ ఎన్నిక

రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యునిగా ఇ.వి. శ్రీనివాస్ రావు ఏకగ్రీవ ఎన్నిక

హన్మకొండ న్యూస్ :   ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర పాలక మండలి సభ్యునిగా ఇ.వి. శ్రీనివాస్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇ.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్యాట్రన్స్, వైస్ ప్యాట్రన్స్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ మెంబర్స్, శ్రేయోభిలాషులు, వాలంటీర్లు మరియు రెడ్ క్రాస్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నిక తనకు లభించిన గౌరవంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచిందని ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు, అవసరంలో ఉన్న ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రక్తదానం, విపత్తు సహాయం, ఆరోగ్య సేవలు, థలసీమియా బాధితులకు సహాయం, యువత మరియు వాలంటీర్ సేవలను మరింత విస్తృతం చేయడానికి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.“ఏకగ్రీవంగా నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, సేవే లక్ష్యంగా పారదర్శకత, సమన్వయం మరియు అంకితభావంతో పనిచేస్తాను” అని  ఇ.వి. శ్రీనివాస్ రావు తెలిపారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News