#Draft: Add Your Title

#Draft: Add Your Title

చౌటకూర్ : గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో చేపడుతున్న జలసిరి పనులను అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట, చౌటకూర్, పోసాన్పల్లి, బొమ్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీల్లో జలసిరి పనుల్లో భాగంగా చేపడుతున్న ఫామ్ పాండ్లను అడిషనల్ డీఆర్‌డీఓ శ్రీ బాల్‌రాజ్ పరిశీలించారు. ఆయా గ్రామాల్లో పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, పనుల నాణ్యత, ప్రయోజనాలు, గ్రామీణ ప్రజలకు కలిగే ఉపయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఆర్‌డీఓ బాల్‌రాజ్ మాట్లాడుతూ.. జలసిరి పనుల్లో భాగంగా ప్రతి గ్రామంలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులను చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే సాధ్యమైనంత మేరకు నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామాల్లో వర్షపు నీటి పారుదల సక్రమంగా ఉండేలా డ్రైన్లు, అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీ పాయింట్లను నిర్మించుకోవాలని సూచించారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జలసిరి పనుల ద్వారా భవిష్యత్‌లో నీటి వనరులను సంరక్షించుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.అధికారుల పర్యటన సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, వాటి ప్రాధాన్యత, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఏపీడీ మదలత, ఎంపీడీవో కే. శంకర్, చౌటకూర్ సర్పంచ్ పార్కల రామ్‌రెడ్డి, పోసాన్పల్లి సర్పంచ్ రేణుక బాలరాజు, బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్ జైపాల్ నాయక్, ఏపీవో రామ్మోహన్, ఈసీ మహేశ్వర్‌రెడ్డి, టీఏ రమేష్, ప్రతాప్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు వేణుగోపాల్, సందీప్, అశోక్, ఉపసర్పంచ్‌లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

WhatsApp Image 2026-09-28 at 3.34.43 PM

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News