ఎంబేరు మన్నారు స్వామి దేవాలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం
కొమురవెల్లి,(సిద్దిపేట): కొమురవెల్లి మండలంలోని కిష్ణంపేట గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన 500 సంవత్సరాల క్రితం నాటి పెబ్బేరు మన్నారు స్వామి దేవాలయానికి నూతన పాలకమండలిని ఎన్నుకోవడం జరిగింది. ఆ పాలకమండలి ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ చైర్మన్ గా మల్లారెడ్డి. ఆలయ ధర్మకర్తలుగా పెద్దాకుల కనకయ్య ,ఆకుల సత్తయ్య, మాదాసు స్వప్న, లింగంపల్లి వెంకటయ్య నియమితులయ్యారు.పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విచ్చేశారు. కిష్టంపేట గ్రామ సర్పంచ్ పంజాల జ్యోతి మల్లేశం మాట్లాడుతూ 500 సంవత్సరంలో క్రితం నాటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడం కోసం దేవాలయాన్ని, దేవాలయ చరిత్రను దేవాదాయ శాఖ దృష్టికి కొమురవెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవుని శ్రీనివాస్ సహకారంతోమాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని కలిసి ఈ దేవాలయ ప్రాముఖ్యతను తెలియజేసి దీనికి కమిటీని వేయాలని కోరారు, వారు దేవాదాయశాఖ సహకారంతో నూతనంగా కమిటీని వేశారు. అలాగే 1.5 కోట్లతో స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి పరచడం కోసం k. జైపాల్ రెడ్డి అనే ధాత సహకారాన్ని అందిస్తానని చెప్పాడు. కిష్టంపేట నుండి ఆలయ మార్గంలో వాగు పైన బ్రిడ్జి నిర్మాణం కోసం సహకరించాలని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరగా నిధులు మంజూరు చేయాలని కోరారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రత్యేకతను నా దృష్టికి తీసుకురాగానే పై అధికారులకు తెలియజేయగానే దేవాలయానికి నూతన కమిటీని వేశారు. ఆలయ నూతన కమిటీగా ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని కబ్జాకు గురైన స్వామివారి 6ఎకరాల భూమిని స్వచ్ఛందంగా దేవాలయానికి ఇచ్చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు.ఈ కార్యక్రమంలో కిష్టంపేట సర్పంచ్ పంజాల జ్యోతి మల్లేశం, రాంసాగర్ సర్పంచ్, కొమురవెల్లి ఆలయ డైరెక్టర్స్, మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


