జిన్నారంలో కోటి 80 లక్షల రూపాయలతో 33 దుకాణాల నిర్మాణ

జిన్నారంలో కోటి 80 లక్షల రూపాయలతో 33 దుకాణాల నిర్మాణ

పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్.

సంగారెడ్డి, 28:  సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఒక కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33 దుకాణాల సముదాయాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నూతన దుకాణాల ద్వారా మున్సిపాలిటీకి ప్రతి నెల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో ప్రతి వార్డులో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని తెలిపారు. జిన్నారం మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, రాజేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Views: 57

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News