పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ 7 లక్షల విలువైన సామాగ్రి భారీ విరాళం

 పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్  7 లక్షల విలువైన సామాగ్రి భారీ విరాళం

 

ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ మరియు భీంగల్ కస్తూరిబా గాంధీ పాఠశాల కు 35 డ్యూయల్ డెస్క్ బెంచ్ ల  పంపిణి

 

నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గంలోని ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామాల హైస్కూళ్లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి  సౌజన్యంతో తన వియ్యంకుడు పారిశ్రామిక వేత్త ఏనుగు దయానంద్ రెడ్డి గారి సహకారంతో సమకూరిన ఒక్కొకటి 1,80,000 రూపాయల విలువ గల సైన్స్ ల్యాబ్ మెటీరియల్‌ను ఈ రోజు వేల్పూర్‌లో ని నివాసంలో ఆయా పాఠశాలకు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.  విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించేందుకు, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ల్యాబ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి  పేర్కొన్నారు. అలాగే భీంగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు  రూ.1,46,650 విలువైన 35 డ్యూయల్ డెస్క్ బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వియ్యంకులు దయానంద రెడ్డి గారు ముందుకు రావడం అభినందనీయమని, విద్యా రంగానికి అయన అందిస్తున్న సహకారం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు పేర్కొన్నారు.ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ఇకముందు కూడా అవసరం ఉన్న చోట మా సహాయ సహాకారాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్య ప్రతినిధులు, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News