హెచ్ఐవీపై కళా ప్రదర్శన ద్వారా అవగాహన

హెచ్ఐవీపై కళా ప్రదర్శన ద్వారా అవగాహన

కాటారం (భూపాలపల్లి ):  తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ సహాయ సహకారంతో కాటారం బస్టాండ్‌లో హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై కళా ప్రదర్శన ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళారంజని సందీప్ కళాబృందం ఆధ్వర్యంలో పాటలు, పల్లెసుద్దులు, నాటకాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ ప్రధానంగా రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి, కలుషిత సూదులు/సిరంజిల వినియోగం, హెచ్ఐవీ ఉన్న తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం వంటి మార్గాల్లో వ్యాపిస్తుందని వివరించారు. హెచ్ఐవీ సాధారణ అంటువ్యాధి కాదని, దానిపై ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హెచ్ఐవీ ఉన్న గర్భిణులకు సరైన వైద్య చికిత్స అందించడం ద్వారా పుట్టబోయే బిడ్డకు వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. అందువల్ల ప్రతి గర్భిణీ హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా ప్రేమ, ఆప్యాయతలు చూపించాలని కోరారు. అలాగే ఉచిత హెల్ప్‌లైన్ 1097పై అవగాహన కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో పాంప్లెట్లు, పోస్టర్లు పంపిణీ చేయడంతో పాటు రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో దిశ సీపీఎం జ్యోతి, సిఎస్ఓ సారయ్య, డిఎండిఓ సాయి,  ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, మారి పీఎం సదానందాం, సూపర్‌వైజర్ రాజు, ఓఆర్‌డబ్ల్యూ రాజబాబు,  సుప్రజ, రేణుక సిబ్బంది పాల్గొన్నారు. కళాకారులు పోలేపాక సందీప్, కృష్ణంరాజు, రాజు, రజిని, వెన్నెల కళా ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకున్నారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News