CCRT శిక్షణ పూర్తి చేసుకుని విధులకు హాజరైన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
బిచ్కుంద, : అస్సాం రాష్ట్ర రాజధాని డిస్పూర్, గువాహటిలో నిర్వహించిన CCRT 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఫత్లాపూర్ ప్రాథమిక పాఠశాలకు తిరిగి విధులకు హాజరైన ఉపాధ్యాయులు పి. శంకర్ గారికి సత్యచైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యచైతన్య యూత్ అధ్యక్షులు హింగు రాము, ఉపాధ్యక్షులు నవీన్, సభ్యులు కర్మవీర్, రవీందర్ తదితరులు పి. శంకర్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయులు హన్మంత్ రావు పాల్గొని శంకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


