ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు..

ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు..

 అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు దగ్ధమైంది.

నిజామాబాద్ సెప్టెంబర్28:( విజన్ ఆంధ్ర): అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నగరంలోని పూలాంగ్​ సమీపంలోని హన్మాన్​ నగరంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో మంటలు లేచాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు రావడంతో దట్టంగా పొగ నిండుకుంది. స్థానికులు గమనించి వెంటనే ఫైర్​ స్టేషన్​కు సమాచారం అందించారు. స్పందించిన ఫైర్​ సిబ్బంది డీఎఫ్​వో పరమేశ్వర్​, జిల్లా ఫైర్​ అధికారి శంకర్​ నేతృత్వంలో సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే జీజీహెచ్​కు తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News