యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి అలవాట్లను అలవరుచుకోవాలి :మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి.

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి అలవాట్లను అలవరుచుకోవాలి :మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి.

భూపాలపల్లి : యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు నశా ముక్త్  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జెడ్పి ఎస్ఎస్ విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహనకార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, భవిష్యత్తుపై పడే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు.అనంతరం  విద్యార్థులచే  ప్రతిజ్ఞ చేయించారు.నిపుణుల ప్రసంగాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు యువత దృష్టి సారించాలని నిర్వాహకులు సూచించారు. యువతను మాదకద్రవ్యాల వ్యసనం నుంచి కాపాడేందుకు కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దేవేందర్ ఎన్సీడి ప్రోగ్రాం ఆఫీసర్ మురళీధర్ రెడ్డి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్లు, హెడ్ మాస్టర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News