చౌటకూర్ గ్రామంలో సర్వే నంబర్ 22లోని ప్రభుత్వ భూమిని సర్వే చేయాలి

చౌటకూర్ గ్రామంలో సర్వే నంబర్ 22లోని ప్రభుత్వ భూమిని సర్వే చేయాలి

ఎమ్మార్వో అనుదీప్‌కు సర్పంచ్ పార్కల రాంరెడ్డి, వార్డు సభ్యుల వినతిపత్రం 

చౌటకూర్,  : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 22లో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారికంగా సర్వే చేయించి, హద్దులు నిర్ణయించాలని కోరుతూ సోమవారం చౌటకూర్ ఎమ్మార్వో అనుదీప్‌కు గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలు వినతిపత్రం సమర్పించారు.గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 22లో ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులను పరిశీలించి, పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని వారు కోరారు. సర్వే అనంతరం ప్రభుత్వ భూమి హద్దులను స్పష్టంగా గుర్తించి, దానిని గ్రామ పంచాయతీ అవసరాలకు వినియోగించుకునేలా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడొచ్చని, అలాగే అక్రమార్కుల ఆక్రమణలకు అవకాశం లేకుండా అడ్డుకట్ట వేయవచ్చని వారు తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వెంటనే అడ్డుకోవడంతో పాటు, భూమిని పరిరక్షించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఈ భూమి విషయంలో అధికారులు సానుకూలంగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్కల రాంరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామగౌడ్, వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి, ఎల్లయ్య, కృష్ణ, అభిలాష్, గంగారం, అశోక్, చక్రపాణి,గోరేమియా, మల్లికార్జున్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 119

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News