పేపర్ ప్లేట్లతో క్యాన్సర్ ముప్పు
- స్టీల్ ప్లేట్ల వాడకమే ఏకైక పరిష్కారం
- - మున్సిపల్ అధికారులు తక్షణమే కఠిన నిషేధం విధించాలి
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : పేపర్ ప్లేట్లలో వేడివేడి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేపర్ ప్లేట్లు నానకుండా ఉండేందుకు వాడే పాలిథిన్, బయో ప్లాస్టిక్, బిస్పినాల్-ఏ వంటి రసాయనాలు వేడి ఆహారం తగలగానే కరిగి శరీరంలోకి చేరుతున్నాయి. దీనివల్ల లివర్, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్లతో పాటు రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది. ఇటీవల ముగిసిన నవరాత్రి అన్నదానాల్లో కోట్ల సంఖ్యలో వాడిన ఈ రసాయన ప్లేట్లు మానవులకే కాక, పశువుల ప్రాణాలకూ ముప్పుగా మారాయి. ఈ పరిస్థితిని అరికట్టడానికి 'స్టీల్ బ్యాంక్' తరహాలో స్టీల్ పాత్రలను వాడటమే సరైన ప్రత్యామ్నాయం అని నిపుణులు అంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులు, టీ హోటళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, డిస్పోజబుల్ ప్లేట్లపై అధికారులు తక్షణమే కఠిన నిషేధం విధించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


