మంజూరు కోసం సిద్ధంగా ఉన్న 255 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

 మంజూరు కోసం సిద్ధంగా ఉన్న 255 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

  • ఫైళ్లపై సంతకాలు చేసిన  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
  • వేల్పూర్‌లోని నివాసంలో అన్ని మండలాల తహసీల్దార్ల సమక్షంలో ఫైళ్ల పరిశీలన, సంతకాలు
  • ఫైల్స్ పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన ప్రభుత్వానికి పంపించాలి
  • కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా లబ్దిదారులకు రూ.1 లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలి

నిజమాబాద్ : మంజూరుకు సిద్ధంగా ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన మొత్తం 255 బ్యాచ్ ఫైళ్లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. సోమవారం వేల్పూర్‌లోని తన నివాసంలో అన్ని మండలాల తహసీల్దార్ల సమక్షంలో ఈ ఫైళ్లపై సంతకాలు చేశారు. మండలాల వారీగా ఫైల్స్ వివరాలు  కమ్మర్‌పల్లి – 24,బాల్కొండ – 28,ముప్కాల్ – 22,మోర్తాడ్ – 32,వేల్పూర్ – 36,భీంగల్ – 103 రుద్రంగి – 10 ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్‌ను తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంచకుండా, త్వరితగతిన పరిశీలించి సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధి పొందిన వారందరికీ, అలాగే నూతనంగా మంజూరు కాబోయే లబ్ధిదారులందరికీ రూ.1 లక్ష చెక్కుతో పాటు తులం బంగారం అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News