ఎమ్మెల్యే బి ఎం ఆర్ సహకారంతో స్మశాన వాటికల అభివృద్ధికి కృషి.

ఎమ్మెల్యే బి ఎం ఆర్ సహకారంతో స్మశాన వాటికల అభివృద్ధికి కృషి.

  • తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి.
  • బిసి స్మశాన వాటికలో పరిశుభ్రత పనులకు శ్రీకారం.

తాండూరు (వికారాబాద్ జిల్లా) ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తాండూరు పట్టణం లోని స్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ నీరాజ బాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సాయిపూర్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న బీసీ శ్మశాన వాటిక సుందరీకరణ లో భాగంగా పారిశుధ్యం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడుతూ.. గతంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం,పలు ఇతర కారణాలతో నిధుల మంజూరులో జాప్యం జరిగిందని తెలిపారు. అందరూ కలిసికట్టుగా  రాజకీయాలు, కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా స్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్మశాన వాటిక ప్రహరీ, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను కల్పించి  మోడల్ శ్మశాన వాటికగా అభివృది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బీసీ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బీసీ విద్యార్థుల హాస్టల్, గదుల నిర్మాణం వంటి సామాజిక అవసరాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. స్మశాన వాటికల సమస్యలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు నిధులు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల్ల నరసింహులు, పట్లోల్ల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-28 at 2.42.59 PM

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News