విప్లవ వీర కిశోరం భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి
సీపీఐ రాష్ట్ర, జిల్లా నేతల డిమాండ్
నాగర్‌కర్నూల్: విప్లవ వీర కిశోరం, అమరవీరుడు షహీద్ భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ, జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు.భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశం కోసం పాతికేళ్లకే ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ త్యాగాన్ని నేటి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు.80 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో పార్లమెంటులో భగత్ సింగ్ విగ్రహం లేకపోవడం బాధాకరమన్నారు. కులం, మతం పేరుతో దేశాన్ని విడదీస్తున్న వేళ భగత్ సింగ్ స్ఫూర్తి అవసరమని, భగత్ సింగ్ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్. ఆనంద్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మధుగౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్, నాయకులు లక్ష్మీనారాయణ, కొత్త రామస్వామి, వంకేశ్వరం శ్రీనివాసులు, ఈర్ల భూపేష్, శివకృష్ణ, బాలపీర్, శేఖర్, హుస్సేన్, విష్ణు, సాయిలు, ఉషమ్మ తదితరులు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


