ఐక్యంగా ముందుకు సాగితేనే గౌడ్ సమాజ అభివృద్ధి: డాక్టర్ బండి సాయన్న గౌడ్

ఐక్యంగా ముందుకు సాగితేనే గౌడ్ సమాజ అభివృద్ధి: డాక్టర్ బండి సాయన్న గౌడ్

వికారాబాద్ జిల్లా గోపా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

వికారాబాద్: గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) ద్వారా గౌడ్ ఉద్యోగులు, అధికారులు, వివిధ రంగాల్లోని ప్రొఫెషనల్స్‌ను ఐక్యం చేసి, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన గోపా సర్వసభ్య సమావేశానికి డాక్టర్ కలాల్ సత్యనారాయణ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ, సుమారు 375 సంవత్సరాల క్రితమే బహుజనులను ఏకం చేసి, సామాజిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ స్ఫూర్తితో నేటి తరం ముందుకు సాగాలని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనులను సంఘటితం చేసి గోల్కొండను స్వాధీనం చేసుకుని, సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో గౌడ్ సమాజం ఐక్యంగా పనిచేసినప్పుడే చట్టసభల్లో మన ప్రాతినిధ్యం పెరుగుతుందని, మనకు రావాల్సిన హక్కులు, వాటాలు సాధించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎన్ని కుల, ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పటికీ, గోపాలో సభ్యత్వానికి అర్హత ఉన్న ప్రతి గౌడ్ ఉద్యోగి, అధికారి, ప్రొఫెషనల్ తప్పనిసరిగా సభ్యత్వం తీసుకుని జాతి ఐక్యత, విద్య, ఉద్యోగ, సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రెముల యాదగిరి గౌడ్ మాట్లాడుతూ, ప్రయత్నం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి మండలానికి చెందిన గౌడ్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ముందుకు వచ్చి మండలాల వారీగా సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తక్కువ సమయంలోనే గోపా సభ్యత్వాన్ని విస్తృతం చేయవచ్చని తెలిపారు.మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు ముకురాల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ముందుగా గౌడ్‌లు ఐక్యమై, అనంతరం యావత్ బహుజన సమాజాన్ని కలుపుకుని ముందుకు సాగితే రాష్ట్ర రాజకీయ, సామాజిక రంగాల్లో బలమైన శక్తిగా ఎదగగలమని అన్నారు. వ్యక్తిగత విభేదాలు, ఇతర సమస్యలను పక్కన పెట్టి ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.వికారాబాద్ జిల్లా గోపా నూతన కమిటీసర్వసభ్యుల సమక్షంలో, వారి ఆమోదంతో వికారాబాద్ జిల్లా గోపా నూతన కమిటీని ప్రకటించారు.- జిల్లా అధ్యక్షులు: డాక్టర్ కలాల్ సత్యనారాయణ గౌడ్

- ప్రధాన కార్యదర్శి: గోవింద్ సతీష్ గౌడ్
- ప్రధాన కార్యదర్శి: వెంకటేష్ గౌడ్ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బండి సాయన్న గౌడ్, వికారాబాద్ జిల్లాలో గోపా సభ్యత్వాన్ని విస్తృతంగా పెంచి, గౌడ్ ఉద్యోగులు, అధికారులు, ప్రొఫెషనల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావాలని సూచించారు.సమావేశాన్ని గోవింద్ సతీష్ గౌడ్ సమన్వయంతో చక్కగా నిర్వహించగా,  గౌండ్ల వెంకటేష్ గౌడ్ సమావేశానికి హాజరైన సభ్యులను ఆహ్వానించి, అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యల్మకంటి మీరయ్య గౌడ్, జిల్లా గౌడ పెద్దలు బండెప్ప గౌడ్, బాలరాజ్ గౌడ్, నారాయణ గౌడ్, రాజేందర్ గౌడ్, శంకర్ గౌడ్, నర్సింహులు గౌడ్, శ్రీహరి గౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News