భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాల ప్రారంభోత్సవం చేసిన

- ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాల ప్రారంభోత్సవం చేసిన

భూపాలపల్లి టౌన్: భూపాలపల్లి జిల్లా క్రీడాల శాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే  గండ్ర సత్యనారాయణ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, విద్యార్థులను పరిచయం చేసుకుని, వారితో కలిసి కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ “విద్యకు ప్రజా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఉదాహరణ కి  బోల్లికుంట గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలికి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా కల్పించడం ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  నాయకత్వంలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది అని చెప్పారు. భూపాలపల్లి క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, వారు పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని రావాలి అని చెప్పారు భూపాలపల్లిలో క్రీడలకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.” అని ఎమ్మెల్యే  తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి, సంబంధిత అధికారులు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News