భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పని చేయాలి

భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పని చేయాలి

విద్యార్థి నాయకుడు మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు

నల్గొండ/మర్రిగూడ :భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థులు, యువజనులు దేశం కోసం పనిచేయాలని  దేశ భవిష్యత్తు  విద్యార్థి, యువజనుల బుజాలపైనే   ఉన్నదని విద్యార్థి నాయకుడు మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా సోమవారం దామెర భీమనపల్లి గ్రామం లో  కాంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులు, గ్రామ యువత తో కలిసి భగత్ సింగ్ చిత్ర పటానికి  పూల మాలలు  వేసి  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  నరనరాల్లో దేశ భక్తి, ఆణువణువునా స్వతంత్ర్యం సాధించాలనే కాంక్ష, పట్టువిడువని పోరాట పటిమ కలిగిన మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు, 1907 సెప్టెంబట్ 28 న  జన్మించి , 13 ఏళ్ల వయసు లోనే బ్రిటీష్ వారి వెన్ను లో ఒనుకుపుట్టించిన అసమాన్య పోరాట యోధుడు అని అన్నారు.23 సంవత్సరాల ప్రాయంలోనే  భరత మాతను దాస్యశృంకలాలను విడిపించడం కోసం, ప్రాణ త్యాగం చేసిన  విప్లవ వీరుడని అన్నారు, నేటి యువతరం కూడా విప్లవ జ్వాలకు, అసలైన మార్గదర్శి గ భగత్ సింగ్ ను చూస్తున్నారంటే, ఆయన పోరాట పటిమ బలమైనది అని అన్నారు. యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో  నడవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో కంటెస్ట్డ్ సర్పంచ్ అభ్యర్థి నడిమింటి శ్రీను,వార్డు సభ్యులు, సిరగోని సుమతి  రవి యాదవ్, అంబళ్ల భవాని రవి గౌడ్, పెంబళ్ల శేఖర్, నాయకులు మునుగాల నాగిరెడ్డి, అంబళ్ల రమేష్ గౌడ్, గొడ్డటి నర్సింహా, ముతయ్య,  కొప్పు వెంకటయ్య, గొడ్డటి బిక్షం, కర్నాటి సత్తయ్య, బొజ్జనగోని శ్రీకాంత్, కర్నాటి వీరేష్ గౌడ్, సిలివేరు గిరి,  సిరగోని లక్ష్మయ్య, కర్నాటి శివ గౌడ్, నడిమింటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 126

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News