నస్పూర్ జాతీయ రహదారి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
నస్పూర్(మంచిర్యాల): నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా అన్నారు. ప్రమాద వార్త తెలియగానే ఆయన సంఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ. రహదారి డివైడర్ కట్ వద్ద ఆటో రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసు కున్నట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని తెలిపారు. జాతీయ రహదారిపై వరుస ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారాలు చేపడతామని హామీ ఇచ్చారు. పరిధిలోని ప్రమాదకర బ్లాక్ స్పాట్‌లను త్వరితగతిన గుర్తించి, అవసరమైన సూచిక బోర్డులు, బారికేడ్లు, కట్టుదిట్టమైన ట్రాఫిక్ నిబంధనల అమలుకు తగినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ పరిశీలనలో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


